పదహారు కుడుముల నోము (పదహరు కుడుముల తద్ది)
పదహారు కుడుముల తద్ది లేదా నోము ఆంధ్రప్రదేశ్ లో మహిళను ఆచరించే నోము . సాధారణంగా ఐశ్వర్యం కోసం ఈ కుడుముల నోము నోచుకుంటారు.
విధానం
ప్రతీ సంవత్సరం బాధ్రపద శుద్ధ తదియ (తెల్లవారితే వినాయక చవితి ) నాడు తలస్నానం చేసి 256 కుడుములు తయారు చేసుకోవాలి. పదహారు కొత్త చేటలు తెచ్చి ఒక్కొక్క చేటలో పదహారు కుడుములు పదహారు నల్లపూసలు, పదహారు రూపాయల దక్షిణ రవిక ఉంచి పదహారు మంది ముత్తైదువులకు వాయనమివ్వాలి. వీరికి దాహం తీర్చడం కూడా కొందరికి సంప్రదాయం ఉంది.
మరొక విధానం
రెండు కొత్త చేటలు తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక చాటలో పదహారు కుడుములు పసుపు కుంకుమ పెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పి ఒక ముతైదువుకు వాయనమివ్వాలి
నోము కథ
పార్వతీ పరమేశ్వరు లొకసారి భూలోక సంచారము చేస్తుండగా ఒకానొక అడవిలో ఏకధారగా ఏడుస్తున్న ఒక రాచకన్య కనిపించింది ఎడతెగని దరిద్రము వలన బాధ పడుతున్నానని ఆ కన్య చెప్పగా విని కరుణించిన గౌరీశంకరులు " అమ్మాయీ గతములో నీవు పదహారుకుడుముల నోము పట్టి ఉల్లంఘనము చేయటము వల్లనే నీకీ దరిద్రము సంభవించింది. వెంటనే యింటికి వెళ్ళి ఆ నోమును యధోక్తముగా చేసుకున్నట్లైతే సిరిసంపదలు కలిగి చిరకాలము సుఖించగలవు ." అని చెప్పిరి . అందుకారాచకన్య వారికి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి చేరి యధావిధిగా నోము పట్టి చేసుకొనెను. ఇట్లుండగా నోము నాడు కుడుములు చేటలో పెట్టి చల్లకి పొరిగింటికి పోగా ఆమె వచ్చునంతలో ఓ కుక్క అక్కడి కుడుములను తినివేసెను . అది గుర్తించిన ఆ రాచకన్య తాను తెచ్చిన చల్లను కూడా ఆకుక్కకే పోసి నమస్కరించగా చల్ల త్రాగి, ఆ కుక్క గౌరిగా మారి ఆమెకు అఖండ అయిశ్వర్యములను ఇచ్చెను.
ఉద్యాపనం
నోము పట్టిన రోజేకాని లేదా ఏదైనా మంచిరోజున కాని ఉద్యాపన చేయాలి. ఆ రోజు పదహారుమంది ముతైదువులను ఆహ్వనించాలి. పదహారు జతల చేటలకు పసుపు కుంకుమరాసి వాట్లో ఒక్కొక్క బిళ్ళకుడుమును పసుపు కుంకుమ ను రెండు గాజులను చీర జాకిట్టు బట్టను నల్లపూసలను వుంచి ఒక చాటతో ఇంకోచాటను మూసి తాంబూలములో పూలు, పండ్లు, ఒక రూపాయి కాయిను వుంచి సిద్దము చేసుకోవాలి. గౌరీదేవిని యధావిధిని పూజించి ఒకచీర జాకెట్ బట్టను ఒక చేట జతలో వుంచి సమర్పించి రెండు బిళ్ళకుడుముల తో పాటు మహానివేదన చేయాలి. తరువాత ఒక్కో ముతైదువుకు పసుపురాసి కుంకుమ పెట్టి గంధము రాసి సిద్ధముగా వుంచుకున్న చేటలజత దక్షిణ తాంబూలాల తో ఇవ్వాలి.
Comments
Post a Comment