ఎటువంటి సమయాలలో వేదాలు, పురాణ, శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు చదువకూడదు అంటారు, It is said that scriptures related to Vedas, Puranas and Shastras should not be read at any time
పాడ్యమి, అష్టమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, చంద్ర సూర్య గ్రహణాలు, ఋతు సంధి కాలాలలో, శ్రాద్ధ భోజనాలు ఈ సమయాలలో చదువుకూడదు. ఈవేళల్లో చదువుకి ఒక రోజు సెలవు పాటించాలి. సంధ్యా సమయంలో ఉరుములు వినబడినప్పుడు, ఆకాశంలో మెరుపులు కనబడినపుడు, భూకంప ఉల్కాపాత సమయాల్లో చదవటం ఆపేయాలి. శిష్య, ఋత్విజ, గురు, బంధు బాంధవులలో ఎవరైనా మరణిస్తే ఆక్షణం నుండి మూడు రోజులు వరకు చదువకూడదు.ఉత్సవాలకు, శక్ర ధ్వజం దిగినప్పుడు, ఏడుపులు పెడబొబ్బలు దగ్గరలో వినబడుతున్నప్పుడు, శవం లేచినప్పుడు తాత్కాలికంగా చదువకూడదు. అపవిత్ర స్థలంలో, అపవిత్రంగా ఉన్నప్పుడు, మాటిమాటికి ఆకాశం మెరుస్తున్నప్పుడు, మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల, పలుమార్లు ఉరుములు వినబడినప్పుడు, జలమధ్యంలో ఉన్నప్పుడు, అర్థరాత్రి వేదశాష్త్రాలను చదువకూడదు. పరుగెడుతూ కాని, మద్యం వాసన వస్తున్న వ్యక్తి ప్రక్కన ఉన్నప్పుడు గాని, గాడిద, ఒంటె, నౌక, గుర్రం, చెట్టు, పర్వతం, మొదలైన వాటిపై కూర్చున్నప్పుడు గాని, ప్రయాణిస్తున్నప్పుడు గాని, దొంగలు, రాజులు గ్రామానికి ఉపద్రవం తెచ్చినప్పుడు గాని వేదశాష్త్రాలను చదువకూడదు.
Comments
Post a Comment