ఆంజనేయుడికి మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయి. How many incarnations did Anjaneya have?
సేకరణ (పరాశర సంహిత)ఆంజనేయునికి మొత్తం చాలా అవతారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తొమ్మిది అవతారాలను పరాశర సంహిత వివరించింది.
1.) ప్రసన్నాంజనేయ అవతారం
స్వామి ఈ అవతారంలో భక్తులకు అభయం ఇస్తూ గద క్రిందకు ఉంటుంది.
2.) వీరాంజనేయ అవతారం
మైందుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి ఈ అవతారం ధరించాడు
3.)వింశతిభుజ అవతారం
ఈ అవతారంలో స్వామికి ఇరవై చేతులు ఉంటాయి. ఈ అవతారం వల్లే స్వామికి భవిష్యద్బహ్మ అయ్యే వరం వచ్చింది
4). పంచముఖ ఆంజనేయ అవతారం
సీతమ్మతల్లి శతకంఠ రావణుడిని వధించే సమయంలో స్వామి ఈ అవతారం ధరించాడు. ఈ అవతారంలో స్వామికి ఐదు ముఖాలుంటాయి.
5). అష్టాదశభుజాంజనేయ అవతారం
ఈ అవతారంలో స్వామికి 18చేతులు ఉంటాయి. మృత సంజీవని విద్యకు అధిపతి.
6.) సువర్చలాంజనేయ అవతారం
ఈ అవతారంలో స్వామి భార్య అయిన సువర్చలా దేవితో కలిసి ఉంటాడు.
7). చతుర్భుజాంజనేయ అవతారం.
ఈ అవతారంలో స్వామి నాలుగు చేతులతో ఉంటాడు. కపిలుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి ఈ అవతారం ధరించాడు.
8). ద్వాత్రిశభుజాంజనేయ అవతారం
ఈ అవతారంలో స్వామికి 32 చేతులు, మూడు తలలు ఉంటాయి
9).వానరాంజనేయ
రామాయణంలో మనకు కనపడే ఆంజనేయస్వామి అవతారమే ఈవానరాంజనేయ అవతారం.
ఈ నవ అవతారాలే గాక సప్తముఖీ ఆంజనేయ, ఏకాదశముఖీ ఆంజనేయ వంటి అవతారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
ఆలయంలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని స్త్రీలు తాకవచ్చా
హనుమంతుడి విగ్రహన్నే కాదు దేవాలయాలలోని ఏదేవతా విగ్రహన్నైనా స్త్రీలు, పురుషులు ఎవరూ తాకకూడడు. దేవాలయంలో అర్చకులు తప్ప ఎవరూ విగ్రహాన్ని తాకకూడడు. దేవాలయ అర్చకులు కూడా దేవుని విగ్రహాన్ని అర్చన చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడూ విగ్రహాన్ని తాకకూడడు
Comments
Post a Comment