Skip to main content

Posts

Showing posts from March, 2023

Sankatahara Chaturdhi - సంకటహర చతుర్ది వ్రతం

గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి  అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం  అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.  ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం  ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.  ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు...

Laksha Vattula Nomu - లక్షవత్తుల నోము

పార్వతి ఆడవారి దోషాలను లెక్కిస్తూ పరమేశ్వరుడికి ఈ విధంగా వివరిస్తుంది ‘‘అన్న, తండి వంటి వావివరుసలు లేకుండా అందమైన మగాడు కనపించగానే స్త్రీలయోని వేడి తగిలిన నెయ్యిలా ద్రవిస్తూ వుంటుంది. అంతేకాదు ఇతర అనేక రహస్య కృత్యాలు అనేక విధాలుగా వున్నాయి. ఇతరుల ఇళ్లలో ఎక్కువ సమయం వుండటం, భర్తతో కఠినంగా మాట్లాడటం, గర్భస్రావం, శిశుహత్య, పెళ్లయిన తరువాత కూడా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఎక్కువగా అసత్యాలు పలకడం, అత్తమామలు-బంధుత్వాలతో అమర్యాదగా ప్రవర్తించడం, దుర్మార్గం చేయడం, శిశుహత్య, క్రోధం పెంచుకోవడం ఇలా ఒకటేంటి మొత్తం పాపాలా పుట్టగా కలిగి వున్న స్త్రీలు చాలామంది వున్నారు. అజ్ఞాతంగా వచ్చిన పాపాలు అంటుకున్నవారు కూడా చాలామంది వున్నారు. ఇటువంటి మహిళలు తమ పాపాలను తుడుచుకోవడానికి, తరించిపోయేందుకు ఏదైనా వ్రతం వుందా’’ అని శివుడిని కోరుతుంది. అప్పుడు శివుడు ఆమె ‘‘లక్షవొత్తుల నోము’’ వ్రతానికి సంబంధించిన విధివిధానాలను, ఉద్యాపనాదులు వివరిస్తాడు. పార్వతి ‘‘ఈ నోమును అంతకుముందు ఎవరు చేసేవారు?’’ అని కోరగా శివుడు దానికి సంబంధించిన ఒక కథను ఈ విధంగా వివరిస్తాడు. ‘‘పూర్వం ఒకనాడు ఆర్యవర్త దేశంలో కాంత అనే ఒక వేశ్య వ...

Puranas and Shastras - ఎటువంటి సమయాలలో వేదాలు, పురాణ, శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు చదువకూడదు

ఎటువంటి సమయాలలో వేదాలు, పురాణ, శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు చదువకూడదు అంటారు, It is said that scriptures related to Vedas, Puranas and Shastras should not be read at any time పాడ్యమి, అష్టమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, చంద్ర సూర్య గ్రహణాలు, ఋతు సంధి కాలాలలో, శ్రాద్ధ భోజనాలు ఈ సమయాలలో చదువుకూడదు. ఈవేళల్లో చదువుకి ఒక రోజు సెలవు పాటించాలి. సంధ్యా సమయంలో ఉరుములు వినబడినప్పుడు, ఆకాశంలో మెరుపులు కనబడినపుడు, భూకంప ఉల్కాపాత సమయాల్లో చదవటం ఆపేయాలి. శిష్య, ఋత్విజ, గురు, బంధు బాంధవులలో ఎవరైనా మరణిస్తే ఆక్షణం నుండి మూడు రోజులు వరకు చదువకూడదు. ఉత్సవాలకు, శక్ర ధ్వజం దిగినప్పుడు, ఏడుపులు పెడబొబ్బలు దగ్గరలో వినబడుతున్నప్పుడు, శవం లేచినప్పుడు తాత్కాలికంగా చదువకూడదు. అపవిత్ర స్థలంలో, అపవిత్రంగా ఉన్నప్పుడు, మాటిమాటికి ఆకాశం మెరుస్తున్నప్పుడు, మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల, పలుమార్లు ఉరుములు వినబడినప్పుడు, జలమధ్యంలో ఉన్నప్పుడు, అర్థరాత్రి వేదశాష్త్రాలను చదువకూడదు. పరుగెడుతూ కాని, మద్యం వాసన వస్తున్న వ్యక్తి ప్రక్కన ఉన్నప్పుడు గాని, గాడిద, ఒంటె, నౌక, గుర్రం, చెట్టు, పర్వతం, మొదలైన వాటిపై కూర్చున్నప్పుడ...

Planting a Tree - ఏ చెట్టు నాటితే ఎటువంటి ఫలితం వస్తుంది

ఏ చెట్టు నాటితే ఎటువంటి ఫలితం వస్తుంది Planting any tree will produce any result వీటిలో ఒక్కో వృక్షం నాటితే ఒక్కోరకమైన ఫలితం వస్తుంది. 1. పాల చెట్టు  -  ఆయుర్దాయాన్ని పెంపొందిస్తుంది. 2. నేరేడు చెట్టు - ఆడపిల్ల సంతానాన్ని ప్రసాదిస్తుంది. 3. దానిమ్మ చెట్టు - ఉత్తమమైన, అనుకూలవతి అయిన భార్యనిస్తుంది. 4. రావిచెట్టు -  సకలరోగాల్ని ప్రసాదిస్తుంది. 5. మోదుగ చెట్టు -సంపదల్ని ప్రసాదిస్తుంది. 6. ఊడుగచెట్టు - వంశాన్ని వృద్ధి చేస్తుంది 7. చండ్ర వృక్షం - వ్యాధుల్ని నిర్మూలిస్తుంది 8. వేప చెట్టు  -  సూర్యుడికి ప్రీతికరం, ఆరోగ్య ప్రదం. 9. మారేడు  - పరమేశ్వరానుగ్రహాన్ని కలిగిస్తుంది. 10. పాటలీవృక్షం  -  పార్వతీదేవికి ప్రీతికరమైనది. 11. మొల్ల వృక్షం  -  గంధర్వులతో సమాగమం. 12. మంజుల వృక్షం - శత్రువుల్ని, దొంగల్ని కూలుస్తుంది. 13. చందన వృక్షం -  ఐశ్వర్య ప్రదం, పుణ్యప్రదం. 14. సంపెంగ . -  సౌభాగ్యాన్ని పెంపొందిస్తుంది. 15. కరీర (వెదురు)వృక్షం  -  పరస్త్రీల సమాగమాన్నిస్తుంది. 16. తాటి చెట్టు  -  సంతానాన్ని నశింపచేస్త...

9 incarnations of Lord Hanuman - ఆంజనేయుడికి మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయి.

ఆంజనేయుడికి మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయి. How many incarnations did Anjaneya have? సేకరణ (పరాశర సంహిత) ఆంజనేయునికి మొత్తం చాలా అవతారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తొమ్మిది అవతారాలను పరాశర సంహిత వివరించింది. 1.) ప్రసన్నాంజనేయ అవతారం స్వామి ఈ అవతారంలో భక్తులకు అభయం ఇస్తూ గద క్రిందకు ఉంటుంది. 2.) వీరాంజనేయ అవతారం మైందుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి ఈ అవతారం ధరించాడు 3.)వింశతిభుజ అవతారం ఈ అవతారంలో స్వామికి ఇరవై చేతులు ఉంటాయి. ఈ అవతారం వల్లే స్వామికి భవిష్యద్బహ్మ అయ్యే వరం వచ్చింది 4). పంచముఖ ఆంజనేయ అవతారం సీతమ్మతల్లి శతకంఠ రావణుడిని వధించే సమయంలో స్వామి ఈ అవతారం ధరించాడు. ఈ అవతారంలో స్వామికి ఐదు ముఖాలుంటాయి. 5). అష్టాదశభుజాంజనేయ అవతారం ఈ అవతారంలో స్వామికి 18చేతులు ఉంటాయి. మృత సంజీవని విద్యకు అధిపతి. 6.) సువర్చలాంజనేయ అవతారం ఈ అవతారంలో స్వామి భార్య అయిన సువర్చలా దేవితో కలిసి ఉంటాడు. 7). చతుర్భుజాంజనేయ అవతారం. ఈ అవతారంలో స్వామి నాలుగు చేతులతో ఉంటాడు. కపిలుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి ఈ అవతారం ధరించాడు. 8). ద్వాత్రిశభుజాంజనేయ అవతారం ఈ అవతారంలో స్వామికి  32 చేతులు, మూడ...

Dharma Sandehalu Tulasi - తులసికి సంబంధించిన అన్ని విషయాలు

తులసీ పత్రాలను ఏ సమయంలో తాకకూడడు, కోయకూడడు.? జ). తులసీ పత్రాలను అమావాస్య, పూర్ణిమ, రోజులలోను ద్వాదశీ నాడు, సూర్య సంక్రమణా దినములు లోను , మధ్యాహ్న కాలంలో, రాత్రి వేళల్లో,ద్విసంధ్యల లోనూ , కోయకూడడు. ఓం అశౌచ సమయములలోనూ, శరీరమునకు నూనె రాసుకుని ఉన్న సమయాల్లోనూ, స్నానం చేయకుండా ఉన్నప్పుడు, మరియు రాత్రి ధరించిన వస్త్రాలతోనూ తులసీ పత్రములు కోయడం, వాటిని తాకడం చేయకూడదు. పై నియమాలు ఉల్లంఘించి తులసీ పత్రాలను కోసిన, తాకినా నా శిరసును ఖండించినట్లే అని స్వయంగా శ్రీహరి చెప్పాడు.   మరణాసన్న కాలంలో చనిపోయేవారి చేత తులసీ జలం ఎందుకు త్రాగిస్తారు. జ.)మృత్యు సమయంలో ఎవరి ముఖమందు (నోటిలో) తులసీ దళాలతో కలిసిన జలం ఒక చుక్కైనా ఉంటుందో వారు నిశ్చయముగా రత్న విమానం అధిరోహించి విష్ణులోకం చేరెను. ఏ దేహదారి మరణాసన్న కాలమున తులసీ జలం సేవించిన వారి సమస్త పాప కర్మల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరెను. తులసి యొక్క మహత్యం, గొప్పదనం చెప్పగలరు ? జ.) తులసికి శ్రీహరి ఇచ్చిన వరాలు 1.తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు, పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి. 2.తులసీ పత్రము యొక్క స్పర్శ కలిగిన జలములో స్నానం చేసిన వారు సర్వ తీర్థములం...

Dharma Sandehalu - ధర్మ సందేహాలు - Telugu Devotion

నిత్య సత్యాలు - ధర్మ సందేహాలు | Eternal Truths - Dharma Sandehalu - Telugu Devotion గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీస్తారు ఒక సమయంలో బ్రహ్మ దేవుడు గణపతికి గుంజీళ్లు తీసి నమస్కరించాక  గణపతి స్వయంగా చెప్పిన మాటలు "ఎవరైతే నాభక్తులై నాఅనుగ్రహన్ని కోరుకుంటారో వారు ఈ బ్రహ్మ దేవుడు వలె రెండు చెవులూ చేతులతో లాగి గుంజీళ్ళు తీసి వారి శిరోభాగాన్ని వేళ్ళు మడిచి చప్పుడు వచ్చేటట్లు చేయవలెను. ఈవిధంగా చేసిన వారి యెడల నేను పరమ ప్రీతుడినై వారు కోరిన వన్నీ ఇస్తాను. ఇది నాకు అత్యంత ప్రీతి కలిగించే నమస్కారం అనడంలో సందేహం లేదు." అందుకని వినాయక ప్రీతి కోసం ఇలా గుంజీళ్ళు తీస్తారు. పూజలో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి. దేవునకు ఎడమవైపు నీటిపాత్ర (కలశం), గంట, ధూప పాత్ర ఉంచవలెను. ఎడమవైపు నూనె దీపాలు వెలిగించాలి. కుడివైపు నేతి దీపం, సువర్ణ జలంతో నింపిన శంఖం ఉంచాలి. దేవుడికి ఎదురుగా హారతి కర్పూరం, పసుపు కుంకుమ ఉంచవలెను. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఏమి ఫలితం అనేక దానాలు చేసిన పుణ్యం, అనేక తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం వైశాఖ మాసంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీరు దానం చేయడం వలన వస్తుంది. బ్రహ్మహత్యతో సమానమైన పా...

Annaprasana - అన్నప్రాశన జరుపుకునే విధానం

సాధారణంగా శిశువు పుట్టగానే వారికి ఆరు నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఆహారంగా ఇస్తారు.అయితే శిశువుకు ఆరు నెలలు రాగానే వారికి చేసే కార్యక్రమం అన్నప్రాసన కార్యక్రమం. అన్నప్రాశన విధానం అన్నప్రాశన అనేది పుట్టిన బిడ్డకు తొలిసారిగా అన్నం తినిపించే కార్యక్రమం ఈ సంస్కారము వలన శిశువుకు ఆయుర్వృద్ధి తేజస్సు ఆరోగ్యం సమకూరుతాయని ప్రజల విశ్వాసం. అన్నప్రాశన ఎక్కడ చేయాలి అన్నప్రాశన కార్యక్రమం దేవుడి గుడిలో లేదా శిశువు యొక్క అమ్మమ్మ ఇంట్లో చేయాలి అన్నప్రాశన ఎప్పుడు చేయాలి అన్నప్రాశన ఆడపిల్లలకు శిశువు పుట్టిన ఐదు నెలల పదకొండు రోజుల తర్వాత నుండి ఆరవ నెల ప్రవేశించే లోపు చేయాలి. లేదా శిశువు పుట్టిన సంవత్సరం లోపు బేసి సంఖ్య గల నెలలో చేయాలి. మగపిల్లలకు అయితే శిశువు పుట్టిన ఆరవ నెలలో లేదా పుట్టిన సంవత్సరం లోపు సరి సంఖ్య గల నెలలో చేయాలి. అన్నప్రాశన ఆడపిల్లలకు ఐదవ నెల మగపిల్లలకు ఆరవ నెల చేయడం శ్రేష్ఠం అని శాష్త్ర వచనం అన్నప్రాశనకు శుభ సమయాలు శుభ తిథులు విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, చతుర్దశి కృష్ణ పక్షంలో వచ్చే చివరి మూడు తిథులు (త్రయోదశి చతుర్దశి అమావాస్య) పనికిరావు శుభ వారములు సోమ, బుధ, గురు, శు...

Telugu Thidhulu - Zodiac Signs - Naskhatra | తెలుగు నెలలు /మాసాలు - 15 తిధులు - 12 రాశుల పేర్లు - 27 నక్షత్రాలు

Telugu Thidhulu - Zodiac Signs - Naskhatra | తెలుగు 15 తిధులు -  12 రాశుల పేర్లు  - 27 నక్షత్రాలు తెలుగు నెలలు /మాసాలు చైత్రం (మార్చి-ఏప్రిల్) వైశాఖం (ఏప్రిల్- మే) జేష్ఠం (మే - జూన్) ఆషాడం (జూన్ - జూలై) శ్రావణం (జూలై- ఆగస్ట్) భాద్రపదం (ఆగస్ట్ - సెప్టెంబరు) ఆశ్వీయుజం (సెప్టెంబరు - అక్టోబరు) కార్తీకం (అక్టోబరు - నవంబరు) మార్గశిరం (నవంబరు - డిశెంబరు) పుష్యం (డిశెంబరు - జనవరి) మాఘం (జనవరి - ఫిబ్రవరి) ఫాల్గుణం (ఫిబ్రవరు - మార్చి) Chaithram  (March-April) Vaisaakham  (April-May) Jyeshttam   (May June) Aashaadham  (June-July) Sraavanam  (July-August) Bhaadhrapadam  (August-September) Aasveeyujam  (September-October) Kaarthikam  (October-November) Maargasiram (November-December) Pushyam (December-January) Maagham (January-February) Phaalgunam (February-March) Tags:  telugu months, telugu nelalu, telugu maasalu/masalu 15 Telugu Thidhulu 15 తెలుగు తిధులు Sl.No తిధి పేరు Telugu Thidhi Name 1 పాడ్యమి Padyami 2 విదియ Vidiya 3 తదియ Thadiya 4 చవిత...