Skip to main content

Posts

Showing posts from December, 2022

భక్తి మార్గాలు

భక్తి మార్గాలు ఎన్ని? అవి ఏమిటి? వాటి గురించి వివరించగలరా? మోక్షం పొందడానికి నవవిధ భక్తి మార్గాలు మన పురణాలలో ఈ భక్తి మార్గాల గురించి చాలా చక్కగా వివరించారు. మొత్తం తొమ్మిది భక్తి మార్గాలు ఉన్నాయి. వీటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు. అంటే ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని, దాన్ని వదలకుండా సాధన చేస్తే ఆ భగవంతుని సన్నిధిని చేరుకోవడం సులభం అన్నమాట. దీని గురించి సద్గురు షిరిడి సాయిబాబా కూడా వివరించారు. తన శిష్యురాలు, తాను తల్లిగా భావించే బాయిజాకి అవతార సమాప్తి అయ్యే కొన్ని గంటల ముందు 9 నాణాలను ఇచ్చి, ఈ నవవిధ భక్తి గురించి, దాని ద్వారా ముక్తిని సాధించే మార్గాలను తెలిపారని సాయి సచ్చరిత్ర ద్వారా తెలుస్తోంది. 'శ్రవణం కీర్తన విష్ణోః స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం' అనేవి నవవిధ భక్తి మార్గాలు. శ్రవణం : ఎల్లప్పుడూ భగవంతుని కథలు, లీలా విశేషాలను వినడం, చదవడం వల్ల ఆ స్వామికి దగ్గరగా నివసిస్తూ ఉండే మార్గం ఇది. ఈ మార్గం ద్వారా భగవంతుని చేరినవారిలో అగ్రేసరుడు పరీక్షిత్. కీర్తన : ఆ భగవంతునిపై కీర్తనలు రచించడమో, లేదా అలా రచించినవారి కీర్తనలను ఎప్పు...