Runa Vimochana Angaraka Stotram – ఋణ విమోచన అంగారక స్తోత్రం
ఈ స్తోత్రాన్ని వినినా.. పఠించినా ఋణ బాధలు తొలగిపోతాయి.... ఋణం అంటే కేవలం ధనాన్ని అప్పుగా తీసుకుంటే వచ్చేది మాత్రమే కాదు... మనకు వేర్వేరు విధాలుగా ఋణాను బంధాల రూపంలోనో లేక వేరొక కంటికి కనపడని రూపంలో ఋణం అనేది ఉండవచ్చు.... ఇది మనను ఎంత బాధిస్తుందంటే ఎంత సంపాదించినా మనస్సుకు శాంతి అనేది ఉండదు.. అందుకే ఈ ఋణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తే తప్పక ఉపశమనం లభిస్తుంది...
స్కంద ఉవాచః
ఋణగ్రస్తనరాణాం తు ఋణముక్తిః కథం భవేత్
బ్రహ్మోవాచః వక్ష్యే హం సర్వ లోకానాం – హితార్థం హితకామదం
శ్రీ మదంగారక స్తోత్రమహామంత్రస్య – గౌతమ ఋషిః – అనుష్ఠుప్ ఛందః
అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్థే జపే వినియోగః
ధ్యానమ్ :
రక్త మాల్యాంబర ధరః శూల శక్తి గదాధరః I
చతుర్భుజో మేషగతో వరదశ్చధరా సుతః II
మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా కృపాకరః I
ధరాత్మజః కుజో బౌమో భూమిజో భూమి నందనః II
అంగారకో యమశ్చైవ సర్వ రోగాపహారకః I
స్రష్టా కర్తాచ హర్తాచ సర్వదేవైశ్చ పూజితః II
ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ I
ఋణం నజాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః II
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
నమోస్తుతే మమాశేష ఋణమాశు విమోచయ II
రక్త గంధైశ్చ పుష్పైశ్చ ధూప దీపై ర్గుడోదనైః I
మంగళం పూజయిత్వాతు మంగళాహని సర్వదా II
ఏక వింశతి నామాని పఠిత్వాతు తదంతికే I
ఋణరేఖాః ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రతః II
తాశ్చ ప్రమార్జయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్
మూలమంత్రః
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
నమోస్తుతే మమాశేష ఋణ మాశు విమోచయ II
ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనం లభేత్I
మహతీం శ్రియ మాప్నోతి హ్యపరో ధనదో యువా II
అర్ఘ్యమ్ :
అంగారక మహీ పుత్ర భగవన్ భక్త వత్సల I
నమోస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ II
భూమి పుత్ర మహా తేజ స్స్వేదోద్భవ పినాకినః I
ఋణార్తస్త్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే II
ఇతి ఋణ విమోచక అంగారక స్తోత్రమ్
ఈ విధంగా స్తోత్రము చేసి చివరి రెండు శ్లోకములతో మూడు పర్యాయములు దోసిలితో నీళ్లు వదిలి పెట్ట వలెను.
ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుల బాధ తీరని వారు ఈ స్తోత్ర పారాయణ చేసి ఫలితాన్ని చూడండి. ఒక పీటమీద ముగ్గులు పెట్టి దానిమీద ఎర్రని బట్ట పరచి దానిమీద అంగారకుని లేదా సుబ్రహ్మణ్యేశ్వరుని చిత్రపటమును ఉంచి - ఎర్రని పూలు, ఎర్ర గంధము తో ఈ క్రింది నామాలు చదువుతూ పూజించాలి.
ఓం మంగళాయ నమః - ఓం భూమి పుత్రాయ నమః - ఓం ఋణ హన్త్రే నమః - ఓం ధన ప్రదాయ నమః
ఓం స్థిరాసనాయ నమః - ఓం మహాకాయాయ నమః - ఓం సర్వకామ ఫల ప్రదాయ నమః - ఓం లోహితాయ నమః
ఓం లోహితాక్షాయ నమః - ఓం సామగాన కృపాకరాయ నమః - ఓం ధరాత్మజాయ నమః - ఓం కుజాయ నమః
ఓం భౌమాయ నమః - ఓం భూమిజాయా నమః - ఓం భూమి నందనాయ నమః - ఓం అంగారకాయ నమః
ఓం యమాయ నమః - ఓం సర్వరోగాపహారకాయ నమః - ఓం స్రష్ట్రే నమః - ఓం కర్త్రే నమః
ఓం హర్త్రే నమః - ఓం సర్వదెవ పూజితాయ నమః
అని పూజించ వలెను.
తరువాత చండ్ర కర్ర ను కాల్చగా వచ్చిన బొగ్గుతో రెండు అడ్డ గీతలు గీసి, వాటి మధ్యలో మీ అప్పుల మొత్తమును రాయవలెను.
అని పూజించ వలెను.
తరువాత చండ్ర కర్ర ను కాల్చగా వచ్చిన బొగ్గుతో రెండు అడ్డ గీతలు గీసి, వాటి మధ్యలో మీ అప్పుల మొత్తమును రాయవలెను.
ఉదాహరణకు :
------------------
రు. 50,400 - 00
------------------
పై విధంగా రాసిన తరువాత పై స్తోత్రమును ఏడు పర్యాయములు చదివి ఏడవ పర్యాయము చదువుతూ ఆ గీతలను, సంఖ్యను ఎడమ పాదముతో పూర్తిగా తుడిచి వేయ వలెను. ఈ విధంగా నలభై రోజుల చెయ్యవలెను. చివరి రోజు చండ్రకర్రలతో కుజునికి హోమంచేసుకుంటే మంచిది.
ఈ విధంగ చేసిన వారికి సంపదలు పెరిగి, అప్పుల బాధ తీరిపోతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
------------------
రు. 50,400 - 00
------------------
పై విధంగా రాసిన తరువాత పై స్తోత్రమును ఏడు పర్యాయములు చదివి ఏడవ పర్యాయము చదువుతూ ఆ గీతలను, సంఖ్యను ఎడమ పాదముతో పూర్తిగా తుడిచి వేయ వలెను. ఈ విధంగా నలభై రోజుల చెయ్యవలెను. చివరి రోజు చండ్రకర్రలతో కుజునికి హోమంచేసుకుంటే మంచిది.
ఈ విధంగ చేసిన వారికి సంపదలు పెరిగి, అప్పుల బాధ తీరిపోతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
Comments
Post a Comment