Skip to main content

Vishvanatha Ashtakam - విశ్వనాథ అష్టకమ్

శివాయ నమః || - Kashi Viswanatha Ashtakam

కాశీ విశ్వనాథ అష్టకం (Kashi Viswanatha Ashtakam)

గంగా తరంగ రమనీయ జఠా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 1 ||

వాచామ గోచర మనీక గుణ స్వరూపం
వాగీష విష్ణు శురసేవిత పాద పీఠం
వామెన విగ్రహ వరేణ కళత్ర వంతం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 2 ||

భూతాధిపం భుజంగ భూషణ భూషితాంగం
వ్యాఘ్ర జినాం బరధరం జఠిలం త్రినేత్రం
పాషాన్‌కుషా భయ వరప్రద శూలపాణిం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 3 ||

సీతాం శుశోభిత కిరీట విరాజ మానం
పాలేక్షణా నల విషోశిత పంచబాణం
నాగాధిపా రచిత భాసుర కర్ణ పూరం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 4 ||

పంచాననం దురిత మత్త మతంగ జాణా
నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం
దావానలం మరణ శోక జరాట వీణా
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 5 ||

తేజోమయం సగుణ నిర్గుణం అద్వితీయం
ఆనంద కందం-అపరాజితం అప్రమేయం
నాగాత్మకం సకల నిష్కలం-ఆత్మరూపం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 6||

రాగాది దోష రహితం స్వజనాను రాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య శుభగం గరళా భిరామం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 7 ||

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపేరతిం చ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హ్రుద్కమల మధ్యగతం పరేశం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 8 ||

వారాణాశీ పురపతే స్తవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య విద్యాం
ష్రియం విపుల సౌఖ్యం అనంత కీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం.
విశ్వనాథాష్టకం ఇదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ
శివ లోక మవాప్నోతి శివేన సహ మోదతే.

ఇతి శ్రీవ్యాసకృతం విశ్వనాథాష్టకం సంపూర్ణమ్ ||

శ్రీ విశ్వనాథాష్టకం

గంగాతరంగరమణీయజటాకలాపం
గౌరీనిరంతరవిభూషితవామభాగమ్ |
నారాయణప్రియమనంగమదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౧ ||
అర్థం – గంగ యొక్క అలలచే రమణీయముగా చుట్టబడిన జటాజూటము కలిగి, ఎడమవైపు ఎల్లపుడు గౌరీదేవి వలన అలంకరింపబడి, నారాయణునకు ఇష్టమైన వాడు, అనంగుని (కామదేవుని) మదమును అణిచివేసినవాడు, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

వాచామగోచరమనేకగుణస్వరూపం
వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్ | [**పాదపద్మమ్**]
వామేన విగ్రహవరేణ కలత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౨ ||
అర్థం – మాటలతో చెప్పడానికి సాధ్యం కాని చాలా గుణములయొక్క స్వరూపము కలిగి, వాగీశ (బ్రహ్మ), విష్ణు మరియు సురులచే సేవింపబడు పాదములను కలిగి, ఎడమవైపు మూర్తీభవించిన భార్యను కలిగి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

భూతాధిపం భుజగభూషణభూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్ |
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౩ ||
అర్థం – భూతములకు రాజుగా, సర్పములను శరీర ఆభరణములుగాచేసికొని, పులిచర్మముమును వస్త్రముగా కట్టుకుని, జటాజూటమును, మూడుకన్నులను కలిగి, పాశమును (త్రాడు), అంకుశమును (గాలము), భయములేనిది, వరములను ఇవ్వగలిగినది అయిన శూలమును చేతితో పట్టుకొనియున్న, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

శీతాంశుశోభితకిరీటవిరాజమానం
భాలేక్షణానలవిశోషితపంచబాణమ్ |
నాగాధిపారచితభాసురకర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౪ ||
అర్థం – చల్లని తేజస్సుతో ఉన్న చంద్రుడిని కిరీటముగా చేసుకొని, నుదుటి కంటి మంటలో అయిదు బాణములను విలీనము చేసుకొని, సర్పములయొక్క రాజుని చెవికి ఆభరణముగా చేసుకొని, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుంగవపన్నగానామ్ |
దావానలం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౫ ||
అర్థం – పాపములచే మదమెక్కిన ఏనుగులకు సింహమువంటి వాడు, పాము వంటి దైత్యులకు నాగాంతకుడు, మృత్యువు, బాధ మరియు ముసలితనము అను అడవికి కార్చిచ్చు, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయమ్ |
నాగాత్మకం సకళనిష్కళమాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౬ ||
అర్థం – దివ్యతేజస్సు కలిగి, గుణములు ఉండి గుణములు లేక, మరొకటిగా లేక, ఆనందమునకు మూలమై, ఎవ్వరిచేత ఓడింపబడక, ఎవ్వరి ప్రమేయము అవసరములేక, నాగాభరణములు కలిగి, కళలు ఉండి కళలు లేని ఆత్మరూపము కలిగి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ |
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౭ ||
అర్థం – ఆశలను విడిచి, పరులను నిందింపక, పాపములలో ఆనందము అనుభవింపక, మనస్సును సమాధి స్థితియందు ఉంచి, మనస్సు అనే కమలము పట్టుకొని మధ్యలో ఉన్న, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

రాగాదిదోషరహితం స్వజనానురాగం
వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయమ్ |
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౮ ||
అర్థం – రాగము వంటి దోషములు లేక, స్వజనులతో అనురాగముతో ఉండి, వైరాగ్యమనెడి శాంతికి నిలయమై, గిరిజతో కూడి, ధైర్యమనెడి మాధుర్యమును చూపుతూ, విషమువలన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో కూడి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

వారాణసీపురపతేః స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః |
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ || ౯ ||
అర్థం – వారాణసీపురపతి అయిన శివుని యొక్క ఈ ఎనిమిది శ్లోకముల స్తవము పఠించు మనుషులకు విద్యలు, ఐశ్వర్యము, అమితమైన ఆనందము, అనంతమైన కీర్తి, కలిగి దేహము వదిలిన తరువాత మోక్షము కలుగును.

(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మచే స్ఫురింపబడి వ్రాయబడినది)

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం...

Telugu Devotional Books Free Download గ్రంధాలయం తెలుగు పుస్తకాలు - E Books Guide

Telugu Devotional Books Free Download తితిదే మహాభారతం తెలుగులో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహాభారతాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా అచ్చమైన తెలుగులో అందరికీ అందుబాటులో ఉంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పించారు. Maha Bharatham Vol 01 - Adi Parvam P-1 Maha Bharatham Vol 02 - Adi Parvam P-2 Maha Bharatham Vol 03 - Sabha Parvam Maha Bharatham Vol 04 - Aranya Parvam P-1 Maha Bharatham Vol 05 - Aranya Parvam P-2 Maha Bharatham Vol 06 - Virata Parvam Maha Bharatham Vol 07 - Udyoga Parvam Maha Bharatham Vol 08 - Bheshma Parvam Maha Bharatham Vol 09 - Drona Parva Maha Bharatham Vol 10 - Karna Parvam Maha Bharatham Vol 11 - Shalya Sowptika Striparvam Maha Bharatham Vol 12 - Santi Parvam P-1 Maha Bharatham Vol 13 - Santi Parvam P-2 Maha Bharatham Vol 14 - Anushasanika Parvam Maha Bharatham Vol 15 - Aswamedha Asramavasa Mousala Mahaprasthanika Parvam Bharathamlo Neethikathalu - Ushasri Mahabharatam Mokshadharmaparvam Modati Bhagam - ...

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను. ...