Skip to main content

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం

దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి.

డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి.

“యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను.

శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి

శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్

శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము

శ్రీ సూక్తం

పఠించవలెను.

“ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.

శ్రీ మహా లక్ష్మి దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామములు . 108 Names of  శ్రీ లక్ష్మి దేవి.

“లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం”

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)

            ~   ఇతి శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి సంపూర్ణం   ~

దీపావళి శ్రీ మహ లక్ష్మి పూజ

వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ ఇష్టపడే ఏకైక పండుగ మాత్రం దీపావళి ఒక్కటే. దక్షిణ భారతదేశమంతా మూడు రోజులపాటు జరుపుకునే దీపావళి ఎంతో ఉత్తేజకరమైన పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాఢ్యమి మూడు రోజులనూ కలిసి సమగ్రమైన దీపావళి. ఈ మూడు రోజుల్లో మొదటిది నరక చతుర్దశి. రెండవది దీపావళి. మూడవది బలిపాడ్యమి.

పూర్వకాలమున అమృతము కొరకు దేవతలు, రాక్షసులు పాలసముద్రమును చిలుకు సమయమున ముందుగా లక్మిదేవి పాలసముద్రము నుండి ఉద్భవించిన. అందుకే ఆమె క్షీరరాజతనయ అని పిలవబడుతున్నది. తరువాత కామధేనువు,కల్పవృక్షము హాలాహలము,చివరిగా అమృతము లభించినవి.ఈ విధంగా ఉద్భవించిన శ్రీమహలక్ష్మిని మనసారాపూజించిన సకల జనులకు ఈ జన్మమునసర్వసుఖములు పరమందు మోక్ష సిద్ధి కలుగుతాయి. కరుణావీక్షణము చేతనే సకల సౌఖ్యముల సమకూర్చగల శ్రిiలక్ష్మి వైకుంఠమున శ్రీమహావిష్ణువు పై కినుక వహించి,భూఅలోకమున అవతరించినది.

నీవు తప్ప నాకేవ్వరు దిక్కని స్తుతించిన వారికి అన్నిటా ఆ లక్ష్మిదేవితోడై అండగా నిలుస్తుంది.భాగ్యం కోసం ఆ తల్లినుఇ ఆరాదించిన వారికి,ఆ మాత బోగభగ్యములను ప్రసాదించే సకల వరప్రదాయిని అవుతుంది.నిస్సంతులు పుజించినచోసంతానలక్ష్మిగా తన అనురాగమును పసతానమును కలిగించును.విజయము కొరకు ప్రార్ధించిన జయలక్ష్మి అయి విజయాన్ని కలిగిస్తుంది.పాండిత్యము కొరకు పూజించిన వారికి విద్యాలక్ష్మిగా సర్వశాస్త్ర పారంగతులను చేసే తల్లి.ధనము కొరకు పూజించే వారికి ధనలక్ష్మి కోరికలు నెరవేర్చే కరుణామూర్తి. పంటలు లేక బాధపడేవారు పూజించిన,ధాన్యమునిచ్చు ధన్యలక్ష్మి.పిరికితనము పొకొట్టు దైర్యలక్ష్మి నిత్యజీవితావసరాలను ఆశించి ప్యజించువారికి అండగా నిలిచి కాపాడే ఆదిలక్ష్మి. ఆ తల్లి యెక్క అష్టరూపాలను ఎవరైతే భక్తిగా,శ్రద్ధగా నియమములతో పూజిస్తారో వారికి తప్పకుండా ఆ తల్లి యెక్క అనుగ్రహము లభిస్తూందనటలో సంశయము లేదు.అశ్ఠలక్ష్మి పూజను చేసి లక్ష్మి పూజాకధను విని,ప్రసాదమును స్వీకరించిన వారి కోరికలు తప్పక నెరవేరగలవు.

దీపావళి ఈ పండుగను ఆచరించే విధానంలో అనేక గాధలున్నాయి. 1. నరకాసుర వధ, 2. బలి చక్రవర్తి రాజ్యదానము, 3. శ్రీరాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశమగుట (భరత్ మిలాప్), 4. విక్రమార్క చక్రవరి పట్టాభిషేకం. భారత దేశమంతటా ప్రచారమున్న గాధ నరకాసుర వధ. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు తరువాత శ్రీకృష్ణుడు నరకాసురుని వధించెను. నరకుడి పీడ వదలటంతో ఆనందపరవశులైన ప్రజలు అదే రాత్రి మిగిలిన భాగమును, మరుదినమునను మహోత్సవాలు జరుపుకొన్నారు. ఆనాటి ఉత్సవాలకు చిహ్నంగా ప్రజలు ప్రతి యేటా ఈ రెండు రోజులూ గొప్పగా పండుగలు చేసుకొంటున్నారు. భరత్ మిలాప్ : శ్రీరామచంద్రుడు రావణ వధానంతరం లంక నుండి అయోధ్యా నగరానికి మరల తిరిగిరావడం, పట్టాభిషేకం జరగడం ఈనాడే అంటారు. శ్రీరాముడు భరతునితో మరల కలియుటకు ఉపలక్షణంగా “భరత్ మిలాప్” అను పండుగ ఉత్తర భారతమంతా నేటికీ చేస్తున్నారు. ఈ విశ్వాసం వల్లనే రాజులు విజయదశమి నాడు సీమోల్లంఘన చేసి శత్రువులపై దాడి చేసి, విజయంతో దీపావళి నాడు మరలి వచ్చుట సంప్రదామయ్యింది. ఒక్కో పురాణంలో, ఒక్కో ధర్మ శాస్త్రంలో ఒక్కో గాధ లిఖించబడినప్పటికీ నరకాసుర వధ మాత్రమే దీపావళి పండుగకు అంకురార్పణ అన్న గాధనే అందరూ అనుసరిస్తుండడంతో అదే స్థిరపడిపోయింది.

దీపావళి ఆశ్వయుజ మాస బహుళ చతుర్ధశిని ‘నరక చతుర్ధశి’ అని, ఆ మరుసటి రోజును ‘దీపావళి’ అమావాస్య అని అంటారు. ఇది పిన్నలకూ, పెద్దలకూ సరదా పండుగ. తలస్నానం చేసి, కొత్త దుస్తులు ధరించడం, పిండివంటలతో భోజనం చేసి, సాయంత్రం కాగానే దీపాల్ని వరుసగా వెలిగించి, అనంతరం టపాకాయలు కాల్చడం ఈ పండుగకు ఆనవాయితి. నరకాసుర సహారం జరిగినందుకు ఆనంద సూచకంగ జరుపుకొనే ఈపండుగ, మార్వాడీలకు ఇంకో విధంగా కూడా ప్రత్యేకమైనది. వారికిది లక్ష్మీ పూజాదినం. పాత ఖాతాలు మూసేసి, కొత్త పద్దులు ప్రారంభిస్తారు.

శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై లోకకంటకుడైన నరకాసురుని వధించినందుకు సంబరంగా జరుపుకొనే ఈ దీపావళి పండుగను దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన దివ్యజ్యోతి ఈ జీవకోటికి వెలుగును ప్రసాదించిన విశిష్టమైన రోజుగా మరియు శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతాదేవితో అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శుభసందర్భంగా కూడా చెప్పుకుంటారు.

దీపావళి రోజు లక్ష్మి పూజ ఎందుకు చేయాలనే దానికి చాలా కథలు ప్రాచుర్యము లో వున్నాయి . అందులో ఒకటి ,
వొకరోజు , ఒకషావుకారు దగ్గరికి ,జేష్టాదేవి , లక్ష్మీదేవి వచ్చి ,ఇద్దరిలో ఎవరు అందముగా వున్నారో చెప్పమని అడిగారు . జేష్టాదేవిని ఇంట్లోనుండి బయటకి పంపాలి , లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి .అందుకు ఉపాయముగా ,జేష్టాదేవితో అమ్మా నీవు వెనుకనుండి అందముగా వున్నావు అనగానే జేష్టాదేవి ఆనందముగా బయటికినడిచింది . లక్ష్మీదేవితో అమ్మా నీవు ముందునుండి అందముగా వున్నావు అనిచెప్పాడు .అప్పుడు లక్ష్మీ దేవి వయ్యారముగా ఇంటిలోకి నడిచింది .

 అప్పటినుండి దీపావళి రోజు సాయంకాలము ముఖ్యముగా వ్యాపారస్తులు లక్ష్మి దేవిని పూజిస్తారని ఓ కథ !

దీపావళికి దేదీప్యమైన దివ్యకాంతుల దీపాలను అలంకరించి, బాణాసంచా కాలుస్తూ, అందరూ వారి వారి ఆనందాలను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇక ప్రకృతి పరంగా ఆలోచిస్తే, ఈ కాలమందు సర్వజీవులను వ్యాధిగ్రస్తులను చేసే కీటకాలు, పంటలను నాశనము చేసే క్రిమికీటకాలు అధికంగా ఉధ్బవిస్తాయి. కనుక ఈ బాణాసంచా కాల్పుల వల్ల కీటకసంహారం కలిగి ప్రజలకు అన్నివిధాల మేలు జరుగుటకే ఈఆచారం పెట్టి ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు.

దీపావళి ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో, ఆ ఇంట శ్రీమహాలక్ష్మి ప్రవేశిస్తుందని మనకు ఋగ్వేదం చెప్తోంది. అటువంటి పుణ్య దిన సాయం సంధ్యా కాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు తొలుత దీపాలు వెలిగించి, శ్రీమహాలక్ష్మి అష్టోత్తరశతనామాలతో క్రింద వర్ణించిన విధంగాపూజ గావించి, ఈ సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టు సర్వ సంపన్న శక్తివంతురాలుగా భావించి, నివేదన చేసి, పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయుటవల్ల కాలి అందియలు ఘల్లు ఘల్లుమ‌ని అన్నట్లు ఆమహాలక్ష్మి ప్రసన్నమౌతుందట!

శ్రీ లక్ష్మీ  అశోత్తర స్తోత్రము -  శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము

దేవ్యువాచ

దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ||
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||

ఈశ్వర ఉవాచ

దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||
సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్ |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ||

ధ్యానమ్

వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |

భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||

సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||

ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||

వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||

అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||

అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||

నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||

పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||

పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||

చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||

విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||

భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||

ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||

శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||

విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||

నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||

మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||

త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||

భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||

భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||

     ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్

అష్టలక్ష్మి స్తోత్రం

1. ఆదిలక్ష్మి

సుమనస వంధిత, సుంధరి, మాధవీ, చంద్ర సహోధరి హేమమయే,
మునిగన మండిత, మోక్ష ప్రధయిని,మంజుల భాషిని, వేదా నూతె,
పంకజ వాసిని దేవ సూపూజిత సద్గుణ వర్షని, సాంతియుతె,
జయ జయ హేయ్ మధుసూధనా కమిని అధిలక్ష్మి సదా పాలయ మాం

2. ధాన్యలక్ష్మి

అయికలి కల్మష నాశీని, కమిని, వైదిక రూపిణీ, వేదా మయె,
క్షీర సముధ్భావ మంగళ రూపిణీ,మంత్ర నివాసిని, మంత్రణుతె,
మంగళ ధాయిని, అంబుజ వాసిని, దేవ గణార్చిత పాదయుతె,
జయ జయ హే మధుసూధనా కమిని,ధాన్యలక్ష్మి సదాపాలయ మాం.

3. దైర్యాలక్ష్మి

జయ వర వర్ణనీ, వైష్ణవి, భార్గవి, మంత్ర స్వరూపిని, మంత్ర మయె,
సురగణ పూజిత శ్రీ ఘ్ర ఫల ప్రధ, జ్ఞాన వికాశిని, శాస్త్రణుతె,
భవ భయ హరిని, పాప విమోచిని, సాధు జనార్చిత పాదయుతె,
జయ జయ హే మధుసూధనా కమిని,దైర్యాలక్ష్మి సదాపాలయ మాం.

4.  గజాలక్ష్మి

జయ జయ దుర్గతి నాశీని కమిని,సర్వ ఫల ప్రధ శాస్త్ర మయె,
రధగజ తురగ పదాతి సమావృత, పరిజన మండిత లోకనుతె,
హరిహర బ్రహ్మ సూపూజిత సేవిత, తాప నివారిణి  పాదయుతె,
జయ జయ హే మధుసూధన కమిని గజాలక్ష్మి సదా పలయ మాం.

5. సంతానలక్ష్మి

అయి ఖఘ వాహినీ, మోహినీ, చక్రిని, రాగ వీవర్ధిని, జ్ఞానమయే,
గుణగణ వారిధి, లోక హితైషిణి, స్వర సప్త భూషిత రాననుతే,
మనుజ సురాసుర దేవ మునీశ్వర,మానస వంధిత పాదయుతె,
జయ జయ హే మధుసూధన కమిని, సంతానలక్ష్మి సదా పలయ మాం

6.  విజయలక్ష్మి

జయ కమలాసని, సద్గతి దాయిని, జ్ఞాన వికాశిని గనమయే,
అనుధిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాధ్యనుతె,
కనకధార స్తుతి వైభవ వందిత శంకర దేశిక మన్యపథే,
జయ జయ హే మధుసూదన కమిని,విజయలక్ష్మి సదా పలయ మాం.

7. విద్యాలక్ష్మి

ప్రణతసురెస్వరి, భారతి, భార్గవి ,శోక వినాసిని, రత్న మయె,
మణి మయ భూషిత  కర్ణ విభూషణ, శాంతి సమావృత హాస్యముఖే,
నవవిధి దాయిని కాలిమల హరిణి, కమిత ఫలప్రధ హస్తయుతె,
జయ జయ హే మధుసూదన కమిని, విద్యాలక్ష్మి సదా పలయ మాం.

8.  ధనలక్ష్మి

ధిమిధిమి ధింధిమి ధింధిమి – ధింధిమి దుందుభి నాధ సూపూర్ణమయే,
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖ నినాద సువాధ్యనూతే,
వేద పురాణేతిహస సూపూజిత, వైదిక మార్గ ప్రదర్శాయుతె,
జయ జయ హే మధుసూధనా కమిని ధనలక్ష్మి రూపేణ సదా పాలయ మాం.

ఫలశృతి

శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని

శ్లో|| శంఖ చక్రగదాయక్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ||

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం...

Telugu Devotional Books Free Download గ్రంధాలయం తెలుగు పుస్తకాలు - E Books Guide

Telugu Devotional Books Free Download తితిదే మహాభారతం తెలుగులో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహాభారతాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా అచ్చమైన తెలుగులో అందరికీ అందుబాటులో ఉంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పించారు. Maha Bharatham Vol 01 - Adi Parvam P-1 Maha Bharatham Vol 02 - Adi Parvam P-2 Maha Bharatham Vol 03 - Sabha Parvam Maha Bharatham Vol 04 - Aranya Parvam P-1 Maha Bharatham Vol 05 - Aranya Parvam P-2 Maha Bharatham Vol 06 - Virata Parvam Maha Bharatham Vol 07 - Udyoga Parvam Maha Bharatham Vol 08 - Bheshma Parvam Maha Bharatham Vol 09 - Drona Parva Maha Bharatham Vol 10 - Karna Parvam Maha Bharatham Vol 11 - Shalya Sowptika Striparvam Maha Bharatham Vol 12 - Santi Parvam P-1 Maha Bharatham Vol 13 - Santi Parvam P-2 Maha Bharatham Vol 14 - Anushasanika Parvam Maha Bharatham Vol 15 - Aswamedha Asramavasa Mousala Mahaprasthanika Parvam Bharathamlo Neethikathalu - Ushasri Mahabharatam Mokshadharmaparvam Modati Bhagam - ...