పది భుజాలు.. మూడు కళ్లు కలిగిన హనుమంతుడిని ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా? నిజంగా ఆంజనేయుడి రూపాల్లోనే ఇది చాలా ఆశ్చర్యకరమైనది. ఈ రూపంలో హనుమంతుడిని చూడాలంటే తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లా ఆనందమంగళం వెళ్లాల్సిందే. ఇక్కడి ఆంజనేయుడికి ‘త్రినేత్ర దశభుజ వీరాంజనేయు’’డని పేరు. ఇక, ఈ ఆలయ చరిత్ర, విశేషాలలోకి వెళ్తే.. హనుమాన్ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అంతేకాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో లేదా రాముని పాదాల వద్ద వినయంగా కూర్చున్న ముద్రలోనో కనిపిస్తాడు. ఇక, ఆంజనేయ ఆలయాల్లో ఆయన అభయహస్త ముద్రలో దర్శనమిస్తాడు. కానీ, తమిళనాడులోని ఆనందమంగళంలో మాత్రం విచిత్ర రూపంలో కనిపిస్తాడు. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడిని మనం చూడవచ్చు. ఈ రూపంలోని హనుమంతుడిని దర్శించు కునేందుకు భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారం ఎత్తి రావణుడిని సంహరించిన అనంతరం నారదుడు ఆయనను కలుసుకున్నాడు. ‘స్వామీ! లంక నాశనంతో మీ యుద్ధం పూర్త...
A Guide For Famous Temples in India